TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండోవ డివిజన్ లో పలు గల్లీలలో విద్యుత్ స్తంభాలు లేక వీధిలైట్లు ఏర్పాటు చేయబోవడంతో పనులు ముగించుకొని రాత్రి వేళలో ఇంటికి వచ్చేటప్పుడు చీకట్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలపడంతో ఎమ్మెల్యే మున్సిపల్ ఎలక్ట్రికల్ ఏఈ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయవలసిందిగా మున్సిపల్ ఏఈ కి ఆదేశాలు ఇవ్వగా గురువారం రోజున ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రాంజీ మరియు మోహన్ తో పాటు మడిపెల్లి మల్లేష్ ప్రతి గల్లీ కాళీ నడకన తిరుగుతూ విద్యుత్ స్తంభాలు లేని గల్లీలో మార్కింగ్ చేసి 37 విద్యుత్ స్తంభాలు నూతనంగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులు రాంజీ మరియు మోహన్ గుర్తించి మార్కింగ్ చేశారని మడిపెల్లి మల్లేష్ తెలిపారు

ఈ సందర్భంగా మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ మా రెండోవ డివిజన్ లో సబ్ స్టేషన్, నాగులమ్మ గుడి,ఇందిరమ్మ కాలని, పీకే రామయ్యా కాలనిలో,ఆటో కాలని,చొక్కారావు విధి, గల్లీల వారు రాత్రి పూట బయటకు రావాలంటే పాములు తేళ్లు విషపురుగులతో భయభ్రాంతులకు గురవుతున్నారని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను ఎమ్మెల్యే తెలపడంతో వెంటనే మున్సిపల్ అధికారులకు, ఫోన్ ద్వారా విద్యుత్ స్తంభాలు లేని గల్లీలలో స్తంభాలు వేసి విద్యుత్ లైట్లు వెలిగించాలని ఆదేశాలు జారీ చేసి మాకు చీకటిని ప్రరాదోలెందుకు కృషి చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్న కు మరియు మున్సిపల్ ఏ ఈ, చంద్రమౌళి,రాంజీ నాయక్, మోహన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రెండవ డివిజన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో సోమశేఖర్, నాగార్జున, పైడిపెల్లి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Madipelli Mallesh
Madipelli Mallesh