Trinethram News : హైదరాబాద్: మాదిగలకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో తాజాగా చేపట్టిన మాదిగల జోడో యాత్ర వాల్ పోస్టర్ ను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. పిడమర్తి ఆధ్వర్యంలో నాయకులు మంత్రిని ఆయన నివాసంలో కలిసి..యాత్ర గురించి వివరించారు. మాదిగల పంతం..కేంద్రంలో బీ జే పీ అంతమని తెలిపారు. కేంద్రం మాదిగలను విస్మరిస్తోందని, మాదిగ జాతిని మేలుకొలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా..మంత్రి పొంగులేటి స్పందిస్తూ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాదిగ రాజకీయ వేదిక చైర్మన్ ఒక్కలగడ్డ సోమచంద్రశేఖర్, నరేష్ పాల్గొన్నారు.
మాదిగల జోడో యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి
Related Posts
నాలుగో రోజు నిరాహార దీక్షలో పాల్గొన్న వికలాంగులు
TRINETHRAM NEWS నాలుగో రోజు నిరాహార దీక్షలో పాల్గొన్న వికలాంగులు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిన విధంగా వికలాంగులకు 6000 వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడీ గీత కార్మికులకు…
నాడు ప్రజాపాలనదరఖాస్తులు..నేడు కుటుంబ సర్వేపత్రాలు
TRINETHRAM NEWS నాడు ప్రజాపాలనదరఖాస్తులు..నేడు కుటుంబ సర్వేపత్రాలుTrinethram News : రోడ్లపై తెలంగాణ ప్రజల వివరాలు-హరీష్రావుకాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది మరో నిదర్శనంప్రజల గోప్యతా హక్కుకు భంగం కలిగించేలా ఉన్న..ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నాం-హరీష్ప్రజల వివరాలకు భద్రత కల్పించాలి-హరీష్రావు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…