TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ అమరవీరుల సంస్మరణ, సభలో పాల్గొన్న కాంగ్రెస్ నేత మాజీ మంత్రివర్యులు డాక్టర్ చంద్రశేఖర్ హైదరాబాద్ టూరిజం ప్లాజా లో జరిగిన మాదిగ అమరవీరుల సంస్మరణ సభలో మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ పాల్గొన్నారు.మాదిగ అమరవీరుల కుటుంబ సభ్యులకు కాళ్లు కడిగిన నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఎస్సీ కులాల అసమానతల వల్లే ఆందోళనలు జరిగాయని అన్నారు.హక్కుల సాధన కోసం పోరాటం జరిగిందని గుర్తు చేశారు.పోరాటంలో అమరులైన వారిని స్మరించుకుంటూ నివాళులర్పించారు.జాతి ప్రయోజనాల కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి అమరులైన వారిని మాదిగలు జీవితాంతం గుర్తుంచుకుంటారని తెలిపారు.
అమరుల రుణం తీర్చుకోలేనిదని అన్నారు.సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంట వ్యవధిలోనే గౌరవ ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణ పై అసెంబ్లీలో ప్రకటన చేశారని మాదిగల పట్ల ఆయనకున్న నిబద్ధత, పేదల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి అని అన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఎమ్మెల్యేలు కాల యాదయ్య , వేముల వీరేశం మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dr. Chandrasekhar