
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 31 : సోమవారం రంజాన్ సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు కెపిహెచ్బి డివిజన్ లోని 7వ ఫేస్ ఈద్గా నందు రంజాన్ ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు 4వ ఫేస్ మసీదు లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ వేడుకల్లో పాల్గొని అల్లా కృపకు పాత్రులు అవడం సంతోషాన్ని కలిగించిందని అలాగే ప్రతి ఒక్కరు జీవితంలో తమ అనుకున్న లక్ష్యాలుతో ముందుకు వెళ్లాలని అల్లా కృప అందరికీ ఉండి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాజేష్ రాయి, పాతూరు గోపి, వెంకటరెడ్డి, నాయకులు, మహిళా నాయకులు, అసోసియేషన్ సభ్యులు, మరియు తదితరులు పాల్గొన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
