గోదావరిఖనిలోని 33వ డివిజన్లోని 5వ ఇంక్లైన్ సమీపంలోని శిదిలావస్థకు చేరుకున్న కల్వర్టు నిర్మాణానికి స్పందించిన నగర పాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్
అదనపు కలెక్టర్, ఇన్చార్జి కమిషనర్ అరుణ ఆదేశాలతో కల్వర్టను సందర్శించిన సుపరెండెంట్ ఆఫ్ ఇంజినీర్ (ఎస్ఈ) శివానంద్
ప్రజలకు ఇబ్బంది కలుగకుండా రెండు రోజుల్లో కల్వర్టు పనులు ప్రారంభించాలని (ఎస్ఈ) కోరిన మద్దెల దినేష్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని ప్రాంతంలోని రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 33వ డివిజన్లో 5వ ఇంక్లైన్ సమీపంలో ఒక కల్వర్టు శిథిలావస్థకు చేరి చాల ప్రమదకరంగా మారిందని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) రామగుండం నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ అరుణ విన్నవించిన వెంటనే వారు స్పందించి వారు రామగుండం నగరపాలక సంస్థ సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ (ఎస్ఈ ) శివానంద్ ఆదేశాలు జారీ చేస్తే వారు 33 వ డివిజన్లోని ప్రమాదకరంగా మారిన కల్వర్టును పర్యవేక్షించి ప్రమాదకరంగాకు ఉందని గుర్తించి ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్ను పిలిపించి పనులు ప్రారంభించాలని చెప్పడం జరిగిందని స్థానిక డివిజన్ యువకుడు డి హెచ్ పి ఎస్ జిల్లా కన్వినర్ మద్దెల దినేష్ పేర్కొన్నారు.
అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతూ గురువారం రోజున స్థానిక 33వ డివిజన్లోని 5వ ఇంక్లైన్ సమీపంలో మజీద్ కాంప్లెక్స్ ప్రక్కన కల్వర్టు పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని కూలిపోయిన కల్వర్టు ను నగరపాలక సంస్థ అధికారులను తీసుకొచ్చి వారికి క్షుణ్ణంగా చూపించి త్వరితగతంగా నిర్మాణ పనులు రెండు రోజుల్లో ప్రారంభించాలని కోరడం జరిగిందని తెలిపారు.
అదే విధంగా 33 డివిజన్లో కొన్ని గల్లిలలో రోడ్లు లేక ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని కావున మరిన్ని సమస్యలను త్వరితగతంగ పరిష్కరించాలని మద్దెల దినేష్ నగరపాలక సంస్థ అధికారులను కోరడం జరిగిందన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App