TRINETHRAM NEWS

న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు

Trinethram News : న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. న్యూ ఇయర్ కానుకగా ఊరట కలిగించే శుభవార్త వచ్చింది. చమురు మార్కెటింగ్ సంస్థలు జనవరి 1, 2025న కమర్షియల్ LPG సిలిండర్ల ధరను తగ్గించాయి. ఢిల్లీలో నేడు 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,804కి పడిపోయింది.

గతంలో రూ. 1,818.5 ఉన్న సిలిండర్ ధర రూ. 14.5 తగ్గింది. దాంతో పాటు జెట్ ఇంధనం లేక ATF ధరలు సైతం నూతన సంవత్సరం రోజు బుధవారం 1.54 శాతం దిగి రావడం విశేషం. కానీ ఇంటి అవసరాల కోసం వినియోగించే సిలిండర్ల ధరలు యథాతథంగా ఉన్నాయి. నేడు 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ల ధర లో ఎలాంటి మార్పు లేదు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App