
ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై ప్రభావం చూపించేదని అభిప్రాయపడింది.
అసలు లోక్‌పాల్‌కు ఆ పరిధి ఉందా అని ప్రశ్నించింది.
వెంటనే నిలిపివేయాలని ఉత్తర్వులు
Trinethram News : న్యూఢిల్లీ, హైకోర్టు సిటింగ్ జడ్జిపై అందిన ఫిర్యాదులను లోక్‌పాల్ విచారణకు స్వీకరించడం ‘చాలా చాలా ఆందోళనకర విషయమ’ని గురువారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై ప్రభావం చూపించేదని అభిప్రాయపడింది. అసలు లోక్‌పాల్‌కు ఆ పరిధి ఉందా అని ప్రశ్నించింది. దీనిని వెంటనే నిలిపివేయాలని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాల ప్రత్యేక ధర్మాసనం ఆదేశించింది. ఫిర్యాదును రహస్యంగా ఉంచాలని, న్యా యమూర్తి పేరును వెల్లడించకూడదంటూ ఫిర్యాదుదారుకు ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సమస్యపై వైఖరి చెప్పాలని కేంద్రం, లోక్‌పాల్ రిజిస్ట్రార్, ఫిర్యాదుదారుకు నోటీసులు పంపించింది. ఫిర్యాదుదారు పేరునూ బయటపెట్టొద్దని, ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందజేయాలని హైకో ర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)కు సూచించింది. కేం ద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ హైకోర్టు సిటింగ్ జడ్జీలు లోక్‌పాల్, లోకాయుక్త చట్టం-2013 పరిధిలోకి రారని స్పష్టం చేశా రు.
గత నెల 27న ఓ హైకోర్టు జడ్జిపై జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్ ఆధ్వర్యంలోని లోక్‌పాల్ బెంచ్ విచారణ ప్రక్రియను ప్రారంభించడంపై తనుకుతానుగా సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ధర్మాసనం కార్యకలాపాలను ప్రా రంభించగానే జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ లోక్‌పాల్ చేపట్టిన విచారణపై స్టే విధిస్తున్నట్టు ప్రకటించారు. తదుపరి విచారణను మార్చి 18న చేపట్టనున్నట్టు ప్రకటించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
