బతికే ఉందాం.. మరో నలుగురిని బతికిద్దాం.. ‘ఎక్స్’లో లోకేశ్ భావోద్వేగ పోస్టు
Trinethram News : అమరావతి : తెలుగుదేశం కార్యకర్త శ్రీను ఆత్మహత్యపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ‘ఎక్స్’లో భావోద్వేగ పోస్టు చేశారు. అన్నా.. అన్నా.. అని పిలుస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసే శ్రీను తనకు ఆపద వస్తే ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు, ఐ మిస్ యూ అంటూ తన బాధను వ్యక్తపరిచారు. కష్టమేంటో కూడా అతడు చెప్పుకోలేదని లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ఓ అన్నగా తానున్నానని.. వారికి అండగా ఉంటూ అన్ని బాధ్యతల్ని నెరవేరుస్తానని భరోసా ఇచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App