Let’s fight for social change with the spirit of public poet Sri Sri
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
విప్లవ కవి శ్రీశ్రీ స్ఫూర్తితో సామాజిక మార్పు కోసం కావ్యాలను రాస్తూ, కంచు కంఠాలతో గళమెత్తి, శ్రీ శ్రీ వారసత్వాన్ని కొనసాగించుదామని ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ కవులు, కళాకారులకు పిలుపునిచ్చారు.
41 వ స్మారక సభను 15 జూన్ 2024న గోదావరిఖని ఐ ఎఫ్ టీ యు కార్యాలయంలో అరుణోదయ జిల్లా అధ్యక్షులు బతుకుల రాజన్న అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సభలో ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ,CH అబెద్నేగో లు పాల్గొని మాట్లాడుతూ శ్రీ శ్రీ కవిత్వం సామాజిక మార్పుకు మార్గాన్ని సుగుమం చేసిందని వారు తెలిపారు. శ్రమ సౌందర్యం గొప్పదనాన్ని కవిత్వం, పాటల ప్రపంచానికి తెలిపిన ప్రజా కవి శ్రీశ్రీ అని ఆయన కొనియాడారు. కుదిరితే పరిగెత్తు. లేకపోతే నడువు. అది కూడా చేతకాకపోతే పాకుతూ పో. ఒకచోట అలా కదలకుండా ఉండిపోకు,
ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతిన్నదని స్నేహితులు మోసం చేశారని ప్రేమించిన వారు వదిలి వెళ్లిపోయారని అలా ఉండిపోతే ఎలా?
సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగి పోకూడదు.కనుక మనిషి నిరాశ నిష్ప్రహలతో ఆగిపోకుండా నిత్యం శ్రమించాలని” బోధించారని వారు అన్నారు.
కన్నీళ్లు కారిస్తే కాదు. చెమట చుక్కలు చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో
అనే విషయాన్ని మనకు గుర్తు చేశారు.
ఈ పుడమి మీద అనేక రకాల జీవులు జీవిస్తున్నాయని, మనిషి జీవితానికి ఒక సార్థకత ఉందని అందుకే నేటి ప్రపంచంలో మన కర్తవ్యాలను నిర్దేశించు కోవాలని వారు సూచిస్తూ అనేక రచనలు చేశారని యాది చేశారు.మనది ఒక బతుకేనా కుక్కల వలె, నక్కల వలె మనది ఒక బతుకేనా సందులలో పందులవలె”అంటూ సమాజాన్ని అర్థం చేసుకొని ఆలోచించే సామర్థ్యం కలిగిన మనం మంచి చెడులను విశ్లేషించుకొని ముందుకు సాగాలని శ్రీశ్రీ వెన్ను తిట్టాడని ఆయన తెలిపారు.
తెలుగు కవిత్వంలో విప్లవాత్మక మార్పు తెచ్చిన శ్రీశ్రీని ఇందిరాగాంధీ నిర్బంధించిన,
కవిత్వానికి సంకెళ్లు విధించాలని ప్రయత్నించిన, ఛేదించి, శ్రామిక జన పక్షాన నిలిచిన శ్రీ శ్రీ ప్రజా కవులకు, కళాకారులకు ఆదర్శమని దాసు కొనియాడారు.” పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతిక అంటూ వెన్ను తిట్టాడని దేశ పౌరుడి బాధ్యతలను గుర్తు చేశారని వారు అన్నారు. ఇబ్బందులను ఎదుర్కొని, అవహేళనలను అధిగమించి, ప్రజా కవిగా చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు.
ఈ స్మారక సభలో సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఈ నరేష్, ఐ ఎఫ్ టీ యు నాయకులు ఎం దుర్గయ్య,ఎం కొమరయ్య, ఐ సాంబయ్య,అరుణోదయ కాసర్ల మల్లేశం, జనగామ రాజన్న, బానేష్,శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App