తెలంగాణలో ఇంటింటికి వెళ్లి కుల గణన సర్వే చేపడతామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రకటించారు.
అసెంబ్లీలో జరిగిన బీసీ కుల గణన తీర్మానం సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు.
ఇంటింటికి వెళ్లి కులాల లెక్కలు తీస్తాం.
ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలను పొందుపరుస్తాం.
సర్వరోగ నివారిని మాదిరిగా సర్వే ఉంటుందని తెలిపారు.
ప్రభుత్వం సర్వేపై స్పష్టతతో ఉందని అన్నారు.