
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, (పాడేరు) జిల్లా ఇంచార్జ్ : జాతీయోద్యమ స్ఫూర్తిని కొనసాగిద్దాం!
మతసామరస్యం వర్ధిల్లాలి.భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రజలు పోరాటాల్లోకి రావాలి
భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల 94 వ వర్ధంతికి పూల మలతో నివాళి. భారత స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తినీ కొనసాగించాలని, సి.పి.ఎం పార్టీ జిల్లా కార్యదర్శి పి.అప్పల నరస పిలుపునిచ్చారు.
పాడేరు పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా చిత్ర పట్టానికి పూల దండవేసి నివాళి అర్పించారు. అనంతరం పి.అప్పల నరస మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల్లోనూ విప్లవ అగ్రశ్రేణికి చెందిన వారిలో భగత్ సింగ్ ఒకరు,భారత స్వతంత్ర సంగ్రామంలో వందలాదిగా ఉద్భవించిన సాయుధ విప్లవ వీరులలో భగత్ సింగ్,రాజగురు, సుఖదేవ్ లు ప్రత్యేకతను సొంతం చేసుకున్నారని అన్నారు. భారతదేశం ఎదుర్కొంటున్న సమస్య లను మార్క్సిజాన్ని జోడించి విశ్లేషించిన మహ మేధావులను దేశం కోల్పోయిందని తెలిపారు.
యువత ఉద్యమ స్పూర్తి తో దేశ రక్షణకై పోరాడాలని అన్నారు. దేశం ఎదురుకుంటూన ఉన్మాదం ప్రమాదకరమైనది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే భారత దేశం యొక్క గొప్పతనాన్ని కీర్తించారు. జాతీయ వాదం పేరుతో దేశం లో మత సామరస్యానికి ప్రమాదం తెచ్చారని, పాలకుల అవినీతి, అక్రమాలపై యువత ప్రశ్నించాలని కోరారు. సహజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తున్న పాలకుల విధానాలను వ్యతిరేకించాలని, భారత రాజ్యాంగం రక్షణకు ప్రజా ఉద్యమాలు పెరగాలని అప్పుడే భగత్ సింగ్ కు అర్పించే నిజమైన నివలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎస్. సుందరరావు, దాస్, చిన్నారావు, రావణం, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
