స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరం కలిసి పనిచేద్దాం : సీఎం చంద్రబాబు
Trinethram News : కడప జిల్లా మైదుకూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘స్వచ్ఛ ఆంధ్ర’ కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. మైదుకూరులో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం. ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర కోసం కృషి చేయాలన్నారు.
“పారిశుద్ధ్య సాధన దిశగా దేశ ప్రజలంతా చేతులు కలపాలి. ప్రధాని మోదీ సారథ్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టాం. గతంలో ఏ ఊరు వెళ్లినా చెత్తాచెదారం కనిపించేది. గ్రామాల్లో మహిళల పరిస్థితి చూసి ఎంతో బాధపడేవాడిని. ఆరోజుల్లో వంట చేయడం మహిళలకు నరకంగా ఉండేది.
దీపం కార్యక్రమం కింద ఆనాడు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. ఇప్పుడు దీపం-2 కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ప్రతి ఇంటి వద్ద చెత్త కలెక్ట్ చేశారా లేదా అనేదానికి క్యూఆర్ కోడ్ పెడతాం. పొడి తడి చెత్తలను వేరువేరుగా కలెక్ట్ చేస్తాం. చెత్త నుంచి ఆదాయం పొందడం పై అందరూ దృష్టి సారించాలి. చెత్త నుంచి విద్యుత్ బయోగ్యాస్ వంటివి తయారు చేయవచ్చు.
ప్రతీ నెల మూడవ శనివారం ప్రతి ప్రభుత్వ కార్యాలయం, ప్రతి పాఠశాల స్వచ్ఛ ఆంధ్ర పై శ్రద్ధ పెట్టాలని చంద్రబాబు సూచించారు. ప్రజలలో అనునిత్యం చర్చ జరిగితే తప్ప ఇది సాధ్యం కాదన్నారు. స్వచ్ఛ భారత్ లో మైండ్ కంట్రోల్ చాలా ముఖ్యమైన అవసరం.. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.
ఇల్లు, పరిసరాలు బాగుంటేనే మంచి ఆలోచనలు వస్తాయి. ఆహ్లాదకర వాతావరణం ఉంటేనే ఏదైనా సాధించగలం. పని ప్రాంతాన్ని కూడా అందరూ శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి నెల మూడవ శనివారం ఏ పని అవసరం లేదు.. మనల్ని మనం బాగు చేసుకోవాలి. సమాజ హితం కోసం అందరం కలిసి పనిచేయాలి” అని సీఎం సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App