TRINETHRAM NEWS

భారీ భద్రతతో దుర్భేద్యంగా ఢిల్లీ, హరియాణా సరిహద్దులు

ఢిల్లీ/చండీగఢ్‌: రైతు సంఘాలు మంగళవారం తలపెట్టిన ‘ఢిల్లీ చలో’మార్చ్‌ నేపథ్యంలో దేశ రాజధానితో పాటు హరియాణా సరిహద్దుల్లో అధికారులు భారీగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు..

నిషేధాజ్ఞలను అమలు చేయడంతో పాటు వాహనాల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు కాంక్రీట్‌ దిమ్మెలు, స్పైక్‌ బారియర్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. టొహానా బోర్డర్‌ వద్ద ఇసుక కంటెయినర్లను, కాంక్రీట్‌ బారికేడ్లను, మేకులను రోడ్డుపై ఏర్పాటు చేశారు..

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి డిమాండ్లతో సంయుక్త కిసాన్‌ మోర్చా, పలు ఇతర రైతు సంఘాలు ఢిల్లీ మార్చ్‌కి పిలుపివ్వడం తెలిసిందే. దాంతో ట్రాక్టర్‌ ట్రాలీ మార్చ్‌ సహా ఎటువంటి నిరసనలు చేపట్టరాదంటూ హరియాణా ప్రభుత్వం 15 జిల్లాల పరిధిలో సెక్షన్‌ 144 విధించింది. శంభు వద్ద పంజాబ్‌తో సరిహద్దును మూసివేసింది. ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్‌ సరీ్వసులను, బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లను మంగళవారం దాకా నిషేధించింది..