
అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 14 : ఈనెల 27 తేదీన జరగబోయే ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కురెడ్ల విజయ గౌరీ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు ప్రచారంలో మాట్లాడుతూ విజయ గౌరీ పిడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గతంలో పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎనలేని కృషి చేశారు వారి తరఫున శాసన మండలి ప్రశ్నించారు.
అంతేకాకుండా ఉద్యోగులు ప్రజా సంఘాలు నిర్వహించే అనేక ఉద్యమాలు ప్రత్యక్షంగా పోరాటంలో భాగస్వాములు అయ్యారు. అప్రెంటిస్ విధానం రద్దు, ఆ సర్వీస్ కు పెన్షన్, నోషనల్ ఇంక్రిమెంట్లు, ట్రైబల్ టీచర్లు సరి రూల్స్, ఎయిడెడ్ టీచర్లకు 010 హెడ్ ద్వారా జీతాలు, కాంట్రాక్ట్ లెక్సులర్లు మినిమం టైం స్కేల్, కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాల టీచర్ సమస్యలు అనేక సమస్యలపై పిడిఎఫ్ గలమెత్తి కొంతమేరకు విజయం సాధించింది శాసనమండలిలో రాజకీయాలకు చోటు లేకుండా పిడిఎఫ్ వంటి అభ్యర్థుల్ని గెలిపించుకుంటే ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా పనిచేస్తారని తెలిపారు పిడిఎఫ్ ఎమ్మెల్సీ లు పనిచేసి చూపించారని తెలిపారు విజయ గౌరీ గెలుపు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యలు శాసన మండల్లో తీసుకెళ్లేందుకు గొంతుక అని అన్నారు. గురుకులాలు, రవ్వలగూడ టి డబ్ల్యూ, డిగ్రీ ఉమెన్స్ కాలేజ్, హై స్కూల్ లో ప్రచార నిర్వహించి టీచర్ ఓటర్లతో సమావేశయి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు కే రామారావు, సిఐటియు నాయకులు కొర్ర మగ్గన్న తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
