TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : బంగారంపేటలో ఆదివాసి లకు, గిరిజనేతరులకు మధ్య మొదలైన భూ పోరాటం.

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, బంగారం పేట లో ఆదివాసీల, గిరిజనేతరుల మధ్య భూ వివాదం. పై వీ ఆర్ వో జోగులమ్మ,సచివాలయం సర్వేయర్ ,మహిళా పోలీస్, ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు..ఈ సందర్భంగా గొలుగొండ మండలం, కేడీ పేట గ్రామస్తులు దుళ్ళ శ్రీనివాసరావు, దలే కావమ్మ అనే గిరిజనేతరులు మాకు బంగారం పేటలో సర్వే నెంబర్ 90 లో 14 ఎకరాల 31 సెంట్లు భూమి 1963 లో మా పూర్వి కులు నర్సీపట్నం లో ఉండే గిరిజనేతరుల, వద్ద కొనుగోలు చేసారు. ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. శిస్తు కడుతున్నాము, రెవెన్యూ అధికారులు వెబ్ ల్యాండ్ లో నమోదు చేసి పట్టాలు(,1_ బీ ) ఇవ్వడం జరిగింది. అని చెప్పడం జరిగింది .ఆదివాసి అయిన మాదల తిరుపతయ్య పేరున అడంగల్ లో సర్వే నెంబర్ 90 లో 14 ఎకరాల 31 సెంట్లు భూమి నమోదు అయి ఉంది.

మా పూర్వీకులు ఎవరికి అమ్మీనట్లు లేదు. అందుకు మా భూమి కొనుగోలు చేసి నట్లు లేదు. 5 షెడ్యూల్ ప్రాంతంలో 1/70 చట్టం అమలులో ఉన్నందున గిరిజనేతరులు, భూమి కొనుగోలు చేయడం గానీ, సాగు చేయడానికి లేదు అందుకు ఈ భూమి మాది అంటూ మాదల తిరుపతయ్య వారసులు మాదల లోవకుమార్ గిరిజనేతరులకు అడ్డు పడడం జరిగింది. వి ఆర్ వో మాట్లాడుతూ ఇరు వర్గాల వాగ్వాదం తో ఇద్దరు వాదనలు రిపోర్ట్ రాసి మండల తహసీల్దార్ కు, తెలియ పరుస్తాను అతను ఫైనల్ గా ఈ సమస్యను పరిస్కరించాలీ అని అన్నారు. అలాగే ఆదివాసి జే ఏ సి జిల్లా కమిటీ సభ్యులు ఎస్ అశోక్ లాల్, పాడి లవ రాజు,ఉల్లి సూరిబాబు మాట్లాడుతూ ఆదివాసీలకు గిరిజనేతరులకు మధ్య భూ పోరాటం మండలంలో మొదలైంది అడుగు నెల కూడా గిరిజ నేతరులకు వదిలేది లేదు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో , ఇరువాడ దేవుడు,మాజీ ఎం పీ టి సి పాంగి చిట్టి బాబు,పాంగి రాజు బాబు,పీసా కమిటీ సభ్యులు సెగ్గె సోమరాజు,,కూడా రాజు, , కె.చంద్రరావు, అంతాడ సర్పంచ్ సుర్ల చంద్రరావు , సతీష్,మాదల సత్యనారాయణ,పాంగి చంద్రరావు, పాంగి నాని బాబు , కే. రామకృష్ణ, పాంగి రాజు బాబు,మాదల శేఖర బాబు,మాదల రమేష్,ఉల్లి నాగరాజు, లోత చిట్టి బాబు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Land dispute between tribals