TRINETHRAM NEWS

Trinethram News : ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : చినకామన పూడి గ్రామం :

గన్ పౌడర్ పేలి కూలీ మృతి

మరొకరి పరిస్థితి విషమం

గన్ పౌడర్ (తుపాకీ మందు) పేలి చేపల చెరువుల వద్ద పని చేసే కూలీలిద్దరు తీవ్రంగా గాయపడగా… వారిలో ఒకరు దుర్మరణం

చినకామన పూడి గ్రామంలోని ఆళ్ల వీరాంజనేయులు చేపల చెరువుపై అస్సాంకు చెందిన బికాస్ బరొ, రిటూ బరొ కాపలాదరులుగా పని చేస్తున్నారు.

చెరువులపై చేపలు తినేందుకు వచ్చే పిట్టలను వారు తుపాకీతో కాల్చి చంపుతుంటారు.

ఈ క్రమంలో వారిద్దరూ తుపాకీలో వాడేందుకు గన్ పౌడర్ తయారు చేస్తుండగా.. మంగళవారం హఠాత్తుగా పేలింది

ఈ ప్రమాదంలో ఇద్దరి ముఖాలపై తీవ్ర గాయా లయ్యాయి.

రిటూ బరో(25) ఎడమ చేయి తునాతునకలు కావడం, తలపై బలమైన గాయాలు కావడంతో మృతి చెందాడు.

బికాస్ బరొకు సైతం తలపై తీవ్ర గాయాలు కావడంతో అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది.

గుడివాడ ప్రభుత్వాసుపత్రి వైద్యుల సిఫారసు మేరకు మెరుగైన వైద్యం కోసం అతడిని విజయవాడ తరలించారు.

పోస్టుమార్టం నిమిత్తం రిటూబరో మృతదేహం గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి వుందని సమాచారం..

ఈరోజు ఉదయం ముదినేపల్లి పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేసే అవకాశం.