TRINETHRAM NEWS

జ్ఞానమే ఆడపిల్లలకు నిజమైన ఆభరణం,

చొప్పదండి : త్రినేత్రం న్యూస్

మూఢనమ్మకాలపై మోడల్ స్కూల్లో అవగాహన సదస్సు, సిఐ ప్రకాష్ గౌడ్
చొప్పదండి : జ్ఞానమే ఆడపిల్లలకు నిజమైన ఆభరణమని మహిళల చైతన్యంతో దేశం అభివృద్ధి సాధ్యమని భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి నరేష్ అన్నారు. చొప్పదండి మండల పరిధిలోని రుక్మాపూర్ ప్రభుత్వ మోడల్ స్కూల్ కళాశాలలో ఎస్సై గొల్లపెల్లి అనూష ఆధ్వర్యంలో మహిళల రక్షణ- సైన్సు- డ్రగ్స్ మూఢనమ్మకాల నిర్మూలన అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఐ ప్రకాష్ గౌడ్ హాజరై మాట్లాడుతూ సమాజంలోని మూఢనమ్మకాలను విద్యార్థులు వదిలిపెట్టి శాస్త్రీయ సమాజ నిర్మాణానికి నడుం బిగించాలని, దొంగ స్వాములు భూత వైద్యులు ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఆర్థికంగా సామాజికంగా మోసం చేస్తున్నారని మూఢనమ్మకాలు లేని శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని డ్రగ్స్ మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలన్నారు. ఈ సందర్భంగా భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి నరేష్, మాంత్రికులు భూత వైద్యులు మోసం చేసే కుట్రలను సైన్స్ మ్యాజిక్ షో ద్వారా విద్యార్థులకు వాటి వెనుక దాగి ఉన్న రహస్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపాల్ ఓం ప్రసాద్, పోలీస్ సిబ్బంది అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App