TRINETHRAM NEWS

తేదీ : 19/01/2025.
కిడ్నాప్ కలకలం.
వెస్ట్ గోదావరి జిల్లా: (త్రినేత్రం న్యూస్): ఇంచార్జ్;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , భీమవరం పట్టణానికి చెందిన విశ్వనాథ వెంకట సత్యనారాయణ తేదీ 18/01/2025 న అనగా శనివారం సాయంత్రం 6 గంటలకు టూ టౌన్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్ అయ్యారు.
వివరాల్లోకి వెళితే తన తల్లిదండ్రులను భీమవరం నుండి హైదరాబాదు పంపించటకు రైల్వే స్టేషన్ వద్దకు కారులో తీసుకొని వెళ్లడం జరిగింది. కారు వద్ద ఒక్కడే ఉండి. తన కుమా కురుడును వారి తల్లిదండ్రులను రైలు ఎక్కియమని చెప్పడం జరిగింది. వాళ్ల ముగ్గురు స్టేషన్ లోకి వెళ్ళగా ఈలోపు సత్యనారాయణ ను కిడ్నాప్ చేశారు. ఇతను రొయ్యల వ్యాపారి. గతంలో బకాయిలు ఎవరికైతే ఇవ్వాలో వాళ్లకి ఇవ్వలేదని , తేలింది.

మాజీ ఎంపీ నందిగామ సురేష్ మరియు వాళ్ల అనుచరులకు కూడా బకాయిలు చెల్లించాలని ప్రజలు అంటున్నారు. తల్లిదండ్రులు మరియు కుమారుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అనంతరం పోలీసులు గాలించగా తన కారును తాడేపల్లిగూడెం వైపు వెళ్లినట్లు సమాచారం తెలిపారు. ఎవరికి ఎంత బకాయిలు చెల్లించాలో, అనేది సత్యనారాయణ దొరికితే తెలుస్తుందని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App