TRINETHRAM NEWS

Khairatabad devotees flocked to have a glimpse of Mahaganapati.. crowded metro station

Trinethram News : హైదరాబాద్‌ : ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి ఎల్బీనగర్, మియాపూర్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో మెట్రో స్టేషన్ పరిసరాలు సందడిగా మారాయి.
వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో ఖైరతాబాద్ గణేశుడికి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో మెట్రో రైలు యాజమాన్యం భక్తులకు ఎలాంటి ఇబ్బందికలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. టికెట్ కౌంటర్లు, ఎగ్జిట్ గేట్ల వద్ద రద్దీ పెరగకుండా తగిన చర్యలు చేపట్టింది. క్యూఆర్ కోడ్ టికెట్లకు, కార్డ్ ద్వారా వెళ్లే ప్రయాణికులను వేర్వేరుగా పంపిస్తోంది.

స్టేషన్ లోపల ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని, కార్డులో సరిపడా డబ్బులు లేకపోతే ఎంట్రీ స్టేషన్‌లో రీఛార్జ్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో ఉదయం నుంచి గంట గంటకు రద్దీ పెరుగుతుండటంతో మెట్రో యాజమాన్యం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. టికెట్ కౌంటర్లు, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లతోపాటు ఫ్లాట్ ఫాం వద్ద భద్రతా సిబ్బంది ప్రయాణికులకు తగిన సూచనలు చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Khairatabad devotees flocked to have a glimpse of Mahaganapati.. crowded metro station