
కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ యస్ సీ సెల్ అధ్యక్షుడు బొట్టు విష్ణు
బాలానగర్ డివిజన్ అద్యక్షులు దర్శనం శాఖయ్య మరియు యస్ సీ సెల్ నాయకులు.
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 19 : కూకట్పల్లి నియోజకవర్గం తో ఏమాత్రం సంబంధం లేని నువ్వు, నీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ఏ నాడు కూకట్ పల్లి ప్రజలకు సేవ చేసింది లేదు. కనీసం ఈ నియోజకవర్గం లో ఏ నాడు నివాసం ఉన్నది కూడా లేదు. కేవలం రాజకీయాల కోసం రోజు సోషల్ మీడియాలో ఉండటం కోసం నోటికొచ్చినట్లు వాగుతూ ప్రతిపక్ష పార్టీ నాయకులపై బురద జల్లుతూ పబ్బం గడుపుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. గత ముప్పయి ఐదు ఏళ్లుకు పైగా ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గం మొదలుకొని కూకట్పల్లి నియోజకవర్గం వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న మాధవరం కృష్ణారావు పై తప్పుడు కూతలు కూస్తే చూస్తూ ఊరుకోం.
నీలాంటి వాళ్ళు ఎందరో ఆయనపై అభాండాలు వేసి అభాసుపాలు కావడమే కాకుండా రాజకీయాల్లోనుంచి కనుమరుగయ్యారనే విషయం గుర్తిస్తే మంచిది. బండి (తొండి) రమేష్ చెప్పాడని ఏదో ఒకరకంగా ఏమ్మెల్యే పై విమర్శలు చేయడం, ఆధారాలు లేని అభాండాలు వేయడం వంటి చీప్ పాలిటిక్స్ చేసి ఏమీ సాధించలేరు. గతంలో నాటి ఎంపీ, నేటి ముఖ్యమంత్రి మొదలు కొని నాటి బీజేపీ అధ్యక్షుడు, నేటి కేంద్ర మంత్రి వరకు కూకట్పల్లి నియోజకవర్గంలో ఏదో జరిగిపోతుందని ఆరోపణలు చేసి రాజకీయ పబ్బం గడుపుకున్నారు. అంతే కానీ ఏ నాడు ఇక్కడి ప్రజలకు వారు చేసింది ఏమీ లేదు. నియోజకవర్గం సమస్యలపై ఏమాత్రం అవగాహన లేని వారు కేవలం తమ పబ్బం గడుపుకోవడానిక్ వసూళ్లు కోసం వారి ఉనికి కోసం చేసే ఆరోపణలను ఇక్కడి ప్రజలు ఎవరు నమ్మరు.
యుగంధర్ రెడ్డి గుర్తు పెట్టుకో ఇక మీదట నీవు నీ ఇంచార్జీ బండి రమేష్ మీ కాంగ్రెస్ నాయకులు నియోజక వర్గంలో చేసే అరాచకాలు వసూళ్లు బయట పెట్టీ మీరు నివసించే నియోజక వర్గం కు తరిమి కొట్టే రోజు దగ్గర లోనే ఉంది అని గుర్తుంచుకో. కాంగ్రెస్ పార్టీ కి నాయకులు లేరు కాబట్టి మీ లాంటి వలస నాయకులను అరువు తెచ్చు కొంటుంది.కానీ మాకు స్థానికంగా బలమైన నాయకత్వం ఉంది..వలస నాయకులు జంపింగ్ జిలానీల అయిన మీ ఇద్దరు మీరు నివాసం ఉండే ప్రాంతంలో రాజకీయం చేసుకోండి.
మా కూకట్ పల్లి కి సేవ చేసేందుకు 35 యేండ్లు గా మా ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పటికే ప్రజలు ఓటు ద్వారా చీ కొట్టారు అయిన మీకు బుద్ధి రాలేదు.ఇంకోసారి మా కూకట్ పల్లి నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పై తప్పుడు ఆరోపలు చేస్తే ఊరుకోమని తగిన బుద్ధి చెపుతామని హెచ్చరిస్తున్నము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ కూకట్ పల్లి నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులు ఎన్.వి రత్నం. ఎడ్ల ప్రభాకర్. కృష్ణ. దగ్గుపాటి వెంకటేష్. పుట్టపాగ మధు. మల్లేష్. బి సమేల్. నాగరాజు. జి కృష్ణ. టి. అనురాధ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
