
Trinethram News : హైదరాబాద్: కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ఇవాళ(గురువారం) జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. శ్రీశైలం నాగార్జునసాగర్లలో ఉన్న నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు వివాదాలు లేకుండా సామరస్య పూర్వకంగా పంచుకోవాలని బోర్డు దిశా నిర్దేశం చేసింది. మొదటగా తాగునీటి అవసరాలకు ప్రయారిటీ ఇవ్వాలని రెండు రాష్ట్రాలకు బోర్డు సూచించింది. పంటల సాగు కీలక దశలో ఉన్నందున.. అవసరానికి అనుగుణంగా వృథా కాకుండా నీటిని వాడుకోవాలని తెలిపింది.
ఎవరికి ఎంత నీటి అవసరం ఉంటుందో ప్రతి 15 రోజులకు ఒకసారి భేటీ కావాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సాగర్ నుంచి ఏపీ 7వేల క్యూసెక్కులు, తెలంగాణ 9వేల క్యూసెక్కుల వాటర్ డ్రా చేసుకుంటున్నట్లు పేర్కొంది. శ్రీశైలం నుంచి 2, 200 క్యూసెక్కుల నీటిని ఏపీ తీసుకుంటుంది. శ్రీశైలం నుంచి తెలంగాణ కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,400 క్యూసెక్కులు డ్రా చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. రెండు ప్రాజెక్టులలో ఉన్న 70 టీఎంసీలను సమ్మర్ వరకు పొదుపుగా వాడుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు సూచనలు చేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
