
ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన సినీ నటుడు చిరంజీవికి బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయనకు బతుకమ్మ జ్ఞాపికను బహూకరించారు.
ఆబాలగోపాలన్నీ అలరించిన నటుడు మెగాస్టార్ అని కొనియాడారు.
ఆయనను పద్మవిభూషణ్ వరించడం తెలుగువారందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు.
PROUD OF U ANNA అని ట్వీట్ చేశారు.
