
త్రినేత్రం న్యూస్ : మార్చ్ 1: నెల్లూరు జిల్లా: కావలి లో 10 లక్షల సీఎం సహాయనిధి ద్వారా లబ్ధిదారునికి అందించిన,కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, ఇటీవ తీవ్ర అనారోగ్య పాలైన కావలి పట్టణానికి చెందిన సైదపేట,మునిమోక్షిత అతి చిన్న వయసులో తీవ్ర అనారోగ్యంతో, బాధపడుతూ ఇటీవలే చెన్నైలోని హాస్పిటల్ నందు అడ్మిట్ అవడం జరిగింది, శస్త్రచికిత్స అవసరమని అక్కడి వైద్యులు సూచించడం జరిగింది. ఇందుకు 25 లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలియజేశారు.
వీరు పేద కుటుంబానికి చెందిన వారు కాబట్టి అంత మొత్తం చెల్లించి వైద్యం చేయించుకునే స్తోమత లేక స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకటక్రిష్ణారెడ్డి ని ఆశ్రయించడంతో ఎమ్మెల్యే, దాగు మాటి కృష్ణారెడ్డి ,వెంటనే స్పందించి సీఎం సహాయ నిధికి అప్లై చేయించి ఎమ్మెల్యే, చొరవతో , తక్షణమే ఎల్. వో. సి,ద్వారా 10 లక్షల రూపాయలను మంజూరుచేయించడం జరిగింది
అంతేకాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడి పాప యొక్క యోగక్షేమాలను తెలుసుకొని,వైద్యులతో మాట్లాడి ఆపరేషన్ విజయవంతం చేయాలని వైద్యులను కోరడం జరిగింది. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే దగుమాటి, వెంకట క్రిష్ణారెడ్డికి, ధన్యవాదాలు తెలిపిన కుటుంబ సభ్యులు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
