TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 1:నెల్లూరు జిల్లా :కావలి. శ్రీ గంగ భవాని అమ్మవారి తిరునాళ్ల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు, టిడిపి నాయకులు,పట్టణ ప్రజలు, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, దాగుమాటి .కావ్య కృష్ణారెడ్డి 50 లక్షల రూపాయలతో సిమెంటు రోడ్లు వేపిస్తానని పట్టణ ప్రజలకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే, కావలిని కనకపట్నం చేయడమే ధ్యేయమని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, తెలిపారు, ఆదివారం రాత్రి కావలి పట్టణంలో లత హాల్ సెంటర్లో శ్రీ గంగ భవాని అమ్మవారి తిరుణాళ్ళలో భాగంగా శ్రీ గంగ భవాని ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి , ముఖ్య అతిధిగా పాల్గొన్నారు,ఉత్సవ కమిటీ సభ్యులు, టిడిపి నాయకులు, పట్టణ ప్రజలు ఎమ్మెల్యే దాగు మాటి,కావ్య కృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ గంగ భవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ దేవత శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని అన్నారు.

ప్రతి ఒక్కరు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానన్నారు.మోడీ,సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్,లోకేష్ , ఆశీస్సులతో కావలి కనకపట్నం కాబోతుందని తెలిపారు, కావలి నియోజకవర్గ ప్రజలు నా వెంట ఉన్నారన్న నమ్మకంతో చంద్రబాబు అడిగిన వనరులు అన్నీ సమకూరుస్తున్నారని అన్నారు,మీరు వేసిన ఓటు వృధా కాకుండా మంచి పాలన అందిస్తానని,కావలిని కాపు కాస్తానని తెలిపారు, ఎన్నో ఏళ్లుగా రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న పెద్దపవని రోడ్డులో అండర్ పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.అలాగే లతా హల్ సెంటర్లో ఉత్సవాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 50 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లకు శ్రీకారం చుట్టపోతున్నామని అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు..

ఉత్సవాల సమయంలో ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు వినోదాన్ని అందిస్తున్న శ్రీ గంగ భవాని ఉత్సవ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.ఈ కార్యక్రమంలో శ్రీ గంగా భవాని ఉత్సవ కమిటీ సభ్యులు,ఆలయ కమిటీ సభ్యులు,అమ్మవారి భక్తులు,టిడిపి నాయకులు కార్యకర్తలు,అభిమానులు భారీగా పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kavali MLA Dagumati Venkata