TRINETHRAM NEWS

kausika haranna was honored by the villagers of lingapuram

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

బసంత్ నగర్ కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించిన కౌశిక హారన్నను లింగాపూర్ గ్రామస్తులు సన్మానించారు ఇలాంటి విజయాలు ముందు ముందు మరెన్నో సాధించాలని ప్రజలకు సేవ చేయాలని మేము మీ వెంటే ఉంటామని వారు అన్నారు.

కౌశిక హరన్న మాట్లాడుతూ మీ అందరి ప్రేమాభిమానాలు మాకు ఉండడం అదృష్టమని ఎన్నో ఎల్లా నుండి పదవి ఉన్నా లేకున్నా నా వెంట ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అని భవిష్యత్తులో మరింత కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్దామని మీ అందరి సహకారాలు ఉండాలని బిఅరెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో నిమ్మరాజుల రవి, గౌడ సంఘం అధ్యక్షులు పులి లక్ష్మణ్ గౌడ్, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు అలపాటి భోజ్ కుమార్, పిట్టల రాములు, పులి శ్రీనివాస్, కన్నం మోహన్, గుర్రం రాజలింగం, మోతుకూరు శేఖర్, పల్లికొండ తిరుపతి, ఇరికిల్ల రాజన్న, పల్లికొండ రాజయ్య, ఇరికిల్ల శివయ్య, ఎలకటూరి లింగమూర్తి, ఇరికిల్ల తిరుపతి, ఇరికిల్ల లింగయ్య,, ఇరికిల్ల రాయలింగ్, ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

kausika haranna was honored by the villagers of lingapuram