TRINETHRAM NEWS

బెయిల్ పై బయటికి వచ్చాక కేటీఆర్, హరీశ్ లను కలిసిన కౌశిక్ రెడ్డి

కౌశిక్ రెడ్డికి బెయిల్

ఆత్మీయంగా హత్తుకున్న కేటీఆర్

భుజం తట్టి అభినందనలు
పార్టీ అండగా ఉంటుందని భరోసా

Trinethram News : Telangana : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కరీంనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. బెయిల్ పై బయటికి వచ్చిన అనంతరం కౌశిక్ రెడ్డి… బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేత హరీశ్ రావులను కలిశారు.

కౌశిక్ రెడ్డిని ఆత్మీయంగా హత్తుకున్న కేటీఆర్… భుజం తట్టి అభినందించారు. కౌశిక్ రెడ్డిపై నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీలో ప్రతి ఒక్కరం కౌశిక్ రెడ్డికి అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.

అనంతరం, కౌశిక్ రెడ్డి… హరీశ్ రావును కలిశారు. హరీశ్ కూడా… కౌశిక్ రెడ్డిని హత్తుకుని అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను పాడి కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App