
Trinethram News : కరీంనగర్: కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో అంజిరెడ్డి విజయం ఖరారైంది. అంజిరెడ్డికి 78,635 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 73,644 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 63,404 ఓట్లు పడ్డాయి.
అంజిరెడ్డి విజయం ఖరారు కావడంతో కౌంటింగ్ హాలు నుంచి నరేందర్ రెడ్డి వెళ్లిపోయారు. కాగా, కరీంనగర్ టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ వశం అయ్యాయి. మరోవైపు అంజిరెడ్డి విజయంపై ఎన్నికల అధికారులు మరికాసేపట్లో ప్రకటన చేయనున్నారు.
కాగా, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోరు నువ్వా, నేనా? అన్నట్లు సాగింది. రెండ్రోజులుగా సాగుతున్న కౌంటింగ్‌తో నేడు విజేత ఎవరనేది తేలిపోయింది. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ.. ఇదే జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్నీ సొంతం చేసుకుంది. అయితే ఓట్ల లెక్కింపు రెండ్రోజులుగా ఎంతో
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
