కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు
రైతులు పండించిన ప్రతి గింజను కటింగ్ లేకుండా కొనుగోలు చెపించే బాధ్యత మీ విజ్జన్నది..
జూలపల్లి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జూలపల్లి మండలంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మంగళవారం రోజున వివిధ గ్రామాలకు చెందిన 60 మంది కళ్యాణ లక్ష్మి మరియు షాది ముభారఖ్ లబ్ధిదారులకు రూ. 60,06,960/- విలువ గల చెక్కులను స్థానిక నాయకులతో మరియు అధికారులతో కలిసి పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 వ సారి కల్యాణ లక్ష్మి & షాది ముబారక్ చెక్కులను పంపిణి చేయడం జరుగుతుందని అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 గ్యారంటీలను దశల వారిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్,ఆరోగ్య 10 లక్షలు, 500/- గ్యాస్, ఇవ్వడం అలాగే ఆనాడు జూలపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఆనాడు ఉన్న బి.ఆర్.ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని ధర్నా చేయడం జరిగింది.. ఆనాడు ఉన్న ప్రభుత్వం జూలపల్లి మండలంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ఇంటి స్థలం ఉన్న ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా ఎంపిక చేయాలన్నారు.
బిఆర్ఎస్ నాయకులు రైతు రుణమాఫీ జరగలేదని, రైతుబంధు ఇవ్వలేదని కేటీఆర్ పిలుపు ఇవ్వడంతో, ఆయన తాబేదారులు అక్కడక్కడ ధర్నాలు చేశారని అన్నారు. ధర్నాలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని, గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు రైతు రుణమాఫీ చేస్తామని, మోసం చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలోనే 70 శాతం పైగా రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు.
గతంలో వారి ప్రభుత్వ హయంలో రైస్ మిల్లర్లతో కుమ్మక్కై క్వింటాలకు 10 నుండి 20 కిలోల వడ్ల కటింగ్ చేసిన బిఆర్ఎస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని రైతుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి, మోసం చేసి, పారిపోయే పార్టీ కాదని, ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేస్తామని, రైతు భరోసాను అందిస్తామని, సన్న వడ్లకు ఈ సీజన్ నుండే ₹ 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ పార్టీ అంటేనే అబద్ధాల పార్టీ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జూలపల్లి మండల తహసీల్దార్, ఎంపిడిఓ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App