June 25 Samvidhan Killing Day
జూన్ 25 సంవిధాన్ హత్యా దివస్: కేంద్రం సంచలన నిర్ణయం
Trinethram News : న్యూ ఢిల్లీ :జులై 12
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 25ను ‘సంవిధాన్ హత్యా దివాస్’గా ప్రకటించింది.
1975 జూన్ 25న ఎమ ర్జెన్సీ ప్రకటించింది ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ. అయితే.. ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా ‘సంవి ధాన్ హత్యా దివాస్’ను తాజాగా ఈరోజు కేంద్రం ప్రకటించింది.
కేంద్ర నిర్ణయాన్ని ఎక్స్‌లో ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. ఎమర్జెన్సీ విధించడం ద్వారా ప్రజాస్వామ్య ఆత్మను హత్య చేశారని ఆయన ఎక్స్ వేదికగా ఆరోపించారు.
ఎమర్జెన్సీ సమయంలో లక్షల మందిని జైల్లో పెట్టా రని, మీడియా గొంతు నొక్కారని ఆయన గుర్తుచేసుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App