TRINETHRAM NEWS

Judicial custody of MLC Kavitha will end today

Trinethram News : హైదరాబాద్:మే 20
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత జ్యుడీషియల్ కస్టడీ సోమ వారంతో ముగియనున్నది.

ఇడి, సిబిఐ రెండు కేసుల్లో నూ సోమవారం విచారణ జరగనున్నది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 2గంటలకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించే విషయంపై రౌస్ అవెన్యూ కోర్టు విచారిం చనున్నది.

జ్యుడీషియల్ కస్టడీ ముగి యడంతో కవితను కోర్టు ముందు ఇడి, సిబిఐ హాజరు పరిచే అవకాశం ఉంది. ఆమెను వర్చువల్ గానా? భౌతికంగా హాజరు పరచాలో అధికారులు సోమవారం నిర్ణయం తీసుకోనున్నారు.

మార్చి 26 నుంచి జ్యుడీషి యల్ కస్టడీలో కవిత ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం విధానంలో కవిత పాత్రపై ఈడీ ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసింది.

ఇడి చార్జిషీట్‌ను పరిగణ నలోకి తీసుకునే అంశంపై సిబిఐ ప్రత్యేక కోర్టు విచా రణ చేపట్టనున్నది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతంలోజ్యుడీషియల్ కస్టడీ ముగిసినప్పటికీ మే 20 వ తేదీ వరకు పొడిగిస్తూ…

ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కవితకు మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును ఇడి కోరింది. 8 వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేశామని ఇడి పేర్కొంది.

దీంతో జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇడి దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై మే 20న విచారణ జరుపుతామని రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడిం చింది…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Judicial custody of MLC Kavitha will end today