TRINETHRAM NEWS

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

మేడిగడ్డ కుంగిన వ్యవహారంలో కేసీఆర్, హరీశ్ రావుకు జిల్లా కోర్టు నోటీసులు

జిల్లా కోర్టు నోటీసులపై హైకోర్టుకు వెళ్లిన కేసీఆర్, హరీశ్ రావు

ఇరువైపుల వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్

Trinethram News : Telangana : మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి జిల్లా కోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరిస్తూ జిల్లా కోర్టు కేసీఆర్, హరీశ్ రావుకు నోటీసులు జారీ చేసింది. జిల్లా కోర్టు నోటీసులపై కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు.

ఇటీవల పిటిషన్‌దారు రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. ఫిర్యాదుదారు మృతి చెందితే పిటిషన్‌కు విచారణార్హత ఏ విధంగా ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది. ఫిర్యాదుదారు మృతి చెందినా పిటిషన్‌ను విచారించవచ్చని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో, ఇరువైపుల వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

KCR and Harish Rao