TRINETHRAM NEWS

Job opportunities for youth with industrial park

Trinethram News : భూపాలపల్లి జిల్లా : ఆగస్టు 03
భూపాలపల్లి జిల్లాలో నిరుద్యోగులు ఉద్యోగాల వేటలో చాలా మంది ఉపాధి కోసం పట్టణాలకు వెళ్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం మారుమూల ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, దనసరి అనసూయ సీతక్క, వరం గల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్యలు అన్నారు.

శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రం లో పర్యటిం చిన మంత్రులు ముందుగా జయశంకర్ జిల్లా గణపురం మండలం గాంధీనగర్ మైలారం గుట్టపై 50 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూపాల పల్లి, వర్ధన్నపేట శాసన సభ్యులు గండ్ర సత్యనారా యణ రావు, కే ఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరేతో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనా రాయణ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో మంత్రులు మాట్లా డారు..భూపాలపల్లికి ఇండస్ట్రియల్ పార్క్ రావడంతో భూపాలపల్లి యువతకు ఉద్యోగావ కాశాలు లభిస్తాయని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ములుగులో కూడా ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఉద్యోగం కోసం తెలంగాణ ఉద్యమం అని చెప్పి గత బీ.ఆర్.ఎస్ పది సంవత్స రాలుగా ఒక్క నోటిఫికేన్ ఇవ్వలేదన్నారు.

ధరణి తెచ్చి ఎందరినో ఇబ్బందులు పెట్టారని, సీఎం రేవంత్ రెడ్డి భూమాతను భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తున్నా రన్నారు. జాబ్ క్యాలెండర్ తెచ్చామన్నారు.

స్కిల్ ఇండియా ద్వారా యువతకు ఉద్యోగావ కాశాలు లభిస్తాయని తెలిపారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రుణ మాఫీ జరిగిందన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఓకే సారి రెండు లక్షల రుణ మాఫీ చేశామన్నారు.

భూపాలపల్లి అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని, వెనుక బడ్డ ప్రాంతాల అభివృద్దే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని మంత్రి సీతక్క తెలిపారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Job opportunities for youth with industrial park