TRINETHRAM NEWS

కేరళలో కొత్త వేరియంట్ కలకలం.. వెలుగులోకి JN.1 వేరియంట్..

COVID subvariant JN.1: దేశంలో మరోసారి కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనపిస్తోంది. తాజాగా కేరళలో కొత్తగా కోవిడ్ సబ్‌వేరియంట్ వెలుగులోకి వచ్చింది. JN.1 సబ్‌వేరియంట్‌ని కనుగొన్నారు.

చైనాలో కేసులకు కారణమవుతున్న ఈ వేరియంట్‌ని తొలిసారిగా కేరళలో గుర్తించారు. JN.1 సబ్‌వేరియంట్, BA.2.86 వేరియంట్‌గా కూడా పిలుస్తారు. మొదటిసారిగా సెప్టెంబర్ 2023లో అమెరికాలతో ఇది కనుగొనబడింది.

ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ గుర్తించడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన పెరుగుతోంది. COVID-19 సబ్-వేరియంట్ JN.1 కేసు డిసెంబర్ 8న కేరళలో కనుగొనబడింది. 79 ఏళ్ల మహిళ శాంపిళ్లను పరీక్షించగా ఈ కొత్త వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు మానవుడి రోగ నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఇంతకముందు సింగపూర్ దేశంలో ఒక భారతీయ టూరిస్ట్‌కి కూడా JN.1 సబ్-వేరియంట్‌ ఉన్నట్లు గుర్తించారు. తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లాకు చెందిన వ్యక్తిలో దీన్ని కనుగొన్నారు. ఆ తర్వాత దేశంలో మరెక్కడా కూడా ఈ వేరియంట్ కనిపించలేదు. తాజాగా కేరళలో వెలుగులోకి రావడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది.

కోవిడ్-19 వేరియంట్ BA.2.86కి JN.1 సబ్ వేరియంట్. ఈ వేరియంట్ ద్వారా ఇప్పటి వరకు ఆస్పత్రిలో చేరడం, తీవ్రమైన అనారోగ్యానికి గురికాలేదని INSACOG చీఫ్, NK అరోరా చెప్పారు. దాదాపుగా ఏడు నెలల అనంతరం భారత్‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్నా్యి. ఇప్పటికే పలు పాశ్చాత్య దేశాల్లో JN.1 వ్యాప్తి పెరుగుతోంది.