TRINETHRAM NEWS

జపాన్‌కు చెందిన ఐస్పేస్‌ అనే ప్రైవేటు అంతరిక్ష సంస్థ ఒక కొత్త ప్రయోగాన్ని చేపట్టనుంది. ఏదైనా విపత్తు తలెత్తి భూమి మీద మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లినా ఇక్కడి భాషాసంస్కృతులు మాత్రం చంద్రుడిపైన ఎప్పటికీ నిక్షిప్తమై ఉండేలా చేయనుంది. ఇందులో భాగంగా చంద్రుడి ఉపరితలం మీదకు రోబోటిక్‌ ల్యాండర్‌తో ఒక మెమొరీ డిస్క్‌ను పంపించనుంది. ఈ డిస్క్‌లో యునెస్కో రాజ్యాంగ పీఠికలో ఉన్న 275 భాషలు పొందుపర్చనున్నారు.