
జనసేన గుర్తు రద్దు చేయాలి . గుర్తిపు జాబితా నుండి తొలగినాలి .
మేడా శ్రీనివాస్,డిమాండ్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్.
Trinethram News : తెలంగాణా రాష్ట్ర ఎన్నికల కమిషన్ “రిజిస్టర్డ్” రాజకీయ పార్టి లకు ద్రోహం చేయుట అన్యాయ మైన చర్య .
గుర్తింపు అర్హత లేక పోయినా ” జనసేన” పార్టి ని తెలంగాణా రాష్ట్ర గుర్తింపు రాజకీయ పార్టిల వరుస సంఖ్యలో చేర్చుటం నిబంధనలకు విరుద్ధం.
మరోసారి అడ్డదారిలో “జనసేన” పార్టి పవన్ కళ్యాణ్ “గాజుగ్లాస్” గుర్తు పొందటం చట్ట విరుద్ధం కాదా !
ఎన్నికల నిబంధనలకు పాతరేసిన తెలంగాణా రాష్ట్ర ఎన్నికల సంఘం. ప్రజాస్వామ్యన్ని కూని చేయటం వంటిది .
ఈ మేరకు జనసేన పార్టీని గుర్తింపు రాజకీయ పార్టీల జాబితా నుండి తొలగించి “గాజుగ్లాస్” గుర్తు ను రద్దు చేయాలి . చట్టాలను గౌరవించాలి ..
అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గుర్తింపు దక్కించుకున్న జనసేన తెలంగాణాలో కూడా అదే ఫార్ములా తో గాజుగ్లాస్ గుర్తు పొందటం దురదృష్టం .
తెలంగాణాలో జరగబోయే జడ్పీటీసీ మరియు ఎమ్ పి టీ సి ఎన్నికల్లో జనసేన కు మేలు చేయాలనే దురుద్దేశ్యం తోనే గాజుగ్లాస్ గుర్తు ను పొందే విధంగా అధికార కుట్ర అధికార దుర్వినియోగం జరుగుతుంది.
తెలంగాణా రాష్ట్రంలో గల రిజిస్టర్డ్ రాజకీయ పార్టి లన్ని ఈ అన్యాయాన్ని ప్రశ్నిద్దాం . ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంద్దాం .
జనసేన కు గాజుగ్లాస్ గుర్తు కేటాయింపు పై తెలంగాణా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించలేదో చెప్పాలి .
జనసేన పార్టి ని ఏ అర్హతతో గుర్తింపు రాజకీయ పార్టిల జాబితాలో చేర్చారో తెలంగాణా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వాలి.
ఈ మేరకు తెలంగాణా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేసిన “రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ” అధ్యక్షులు మేడా శ్రీనివాస్.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
