TRINETHRAM NEWS

మహా కుంభమేళా పవిత్ర అమృత పుణ్య స్తానాలు ఆచరించిన జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం, మరియు వారి కుటుంబ సభ్యులు, మరియు వారణాసి పుణ్య క్షేత్రాలు దర్శించుకోవడం జరిగింది…

విశాఖ రూరల్ జిల్లా : వివరాల్లోకి వెళితే ఉల్లి సీతారాం మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా భక్తజనంతో కిక్కిరిసిపోయిందని అన్నారు.. ఇలాంటి అవకాశం నాకు మా కుటుంబసభ్యులకు రావడం పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నానన్నారు… కొన్ని కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చి పుణ్యస్తానాలు ఆచరించినట్టు అని అలాగే మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఉత్సవం అధ్యాత్మిక పరిమళలు వెదజల్లే మహోత్తర సమ్మేళనం అని, 144 ఏళ్లకొకసారి వచ్చే అధ్యాత్మిక సమ్మేళనం అని, ఆహ్వానం లేకుండానే కోట్లాదిమంది హాజరయ్యే వేడుక అని, భారతీయ ఆద్యాత్మికతకు, ఆత్మకు ప్రతిరూపంకంగా భావించే మహా కుంభమేళాకు భారత దేశం హిందూసమాజానికి ప్రత్యేకమైనదని అన్నారు.. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌ!!

శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలు ముందుకు వెళ్లాలని, ఆయనకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు,ప్రసాదించాలని ఆ స్వామి వారిని మొక్కు కోవడం జరిగింది… భారతదేశ చరిత్రలో కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, ప్రయోజరాజ్ నిర్వహించనున్న ఈ మహా కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులకు, సాధువులకు, ఒక పెద్ద ఆధ్యాత్మిక సదస్సుగా నిలుస్తుందని, ఈ మహా కుంభమేళాకు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని,చెబుతుంటారు.. ఈ మహా కుంభమేళాను ఆదిశంకరాచార్యులు ప్రారంభించారని తెలిపారు…అలాగే గిరిజన ప్రాంత ప్రజలపై ఆ స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని, గిరిజన ప్రజానీకం కి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాం అన్నారు… అలాగే స్వామి వారి విశిష్ట తెలుపుతూ ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని సూచిస్తుందని, ఈ రాశిలో కుంభమేళాను నిర్వహిస్తారని, సూర్యుడు, బృహస్పతి సంచారం ఆధారంగా ఈ కుంభమేళా తేదీలు నిర్ణయిస్తారు అని తెలిపారు…సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు..నాసిక్ త్రయంబకేశ్వర్ లో కుంభమేళా నిర్వహిస్తారు అని అన్నారు…

సనాతన ధర్మన్ని రక్షించడం హిందూ యొక్క బాధ్యత అని, ధర్మో రక్షతి రక్షితః అని వివరణ ఇచ్చారు.. అలాగే మన మతాన్ని గౌరవించడం మన సంప్రదాయం అని పర మతాన్ని ప్రేమించాలని అన్నారు… కులాలకు మతాలకు అతీతమైన పార్టీ జనసేన పార్టీ అని జనసేన పార్టీ స్థాపన నుండి జనసేన పార్టీ సిద్ధాంతాలలో ఒక సిద్ధాంతం కులాలను మతాలను కలిపే ఆలోచన విధానం అని అన్నారు… హిందూ సాంప్రాదాయ్యాన్ని ప్రేమిస్తాను, పరమతాన్ని గౌరవిస్తానన్నారు..కులాలకు మతాలకు అతీతంగా కుటుంబ సభ్యులుగా ముందుకు వెళ్ళి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర ప్రజానికానికి పిలుపునిచ్చారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App