
అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం త్రినేత్రం న్యూస్ మార్చి 19: అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఐటీ టీమ్ కో ఆర్డినేటర్ సీ.హెచ్ అనిల్ కుమార్, పాడేరు మండల అధ్యక్షులు నందోలి.మురళీ కృష్ణ ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన అనంతరం భద్రత ఓట్ల స్ట్రాంగ్ రూమ్ లు తనిఖీ చెయ్యడం జరిగింది. పాడేరు మండలం ప్రభుత్వం డిగ్రీ కళాశాల లో భద్రతపరిచిన ఎమ్మెల్సీ ఓట్ల బాక్సులు స్టోరేజ్ రూంలో పోలీస్ సిబ్బంది సెక్యూరిటీ తో ఉన్న ఓట్ల బాక్సులు వేరే చోట తరలిస్తాం అని కలెక్టర్ సమాచారం ఇవ్వడం జరిగింది.
ఓట్ల బాక్సులు వేరే చోట మారుస్తామని తెలియజేశారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలోనే మారుస్తామని మీరు తప్పకుండా హాజరవ్వాలని కలెక్టర్ వివరణ ఇచ్చారు. జనసేన నాయకులు ఓట్ల బాక్స్ లు భద్రత కారణంతో తనిఖీ చెయ్యడం జరిగింది. కూటమి జనసేన నాయకులు సీ.హెచ్ అనిల్ కుమార్,నందోలి మురళీ కృష్ణ మాట్లాడుతూ తప్పకుండా ఓట్ల బాక్సులు మార్చిన్నపుడు మాకు తెలియజేయాలని తప్పకుండా మేము హాజరవుతామని తెలిపారు. అలాగే స్ట్రాంగ్ రూమ్స్ పాడేరు, అరకు, రంపచోడవరం వివిధ నియోజకవర్గ సంబంధించిన స్టోరేజ్ లో భద్రతలో ఉన్న బాక్సులను కలెక్టర్ తో సిబ్బందితో పరిశీలించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిర్ఓ పద్మ లత, ఏం ఆర్ ఓ త్రినాథ్ సుపరిడెంట్ తిరుమల రావు, శ్రీను రాజేష్ ఢీటీ, బీజేపీ యూత్ వింగ్ పాత్రుడు, టీడీపీ ఏం పీటీసీ శివ, సీనియర్ నాయకులు జ్యోతి కిరణ్ రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది కూటమి ప్రతినిధులు కూటమి నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
