
అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ పెదబయలు ఏప్రిల్ 7: అరకు నియోజకవర్గం, పెదబయలు మండలం, గసాబు గ్రామంలో స్థానిక గ్రామస్తుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా కుటుంబ సభ్యులతో పాల్గొన్న వంపూరు.గంగులయ్య ముందుగా గ్రామస్తులు గిరిజన సంప్రదాయాలతో ఘనంగా ఆహ్వానం పలికారు. వంపూరు.గంగులయ్య శ్రీశ్రీశ్రీ సీతారాముల వారి పూజ విశిష్ట తెలుపుతూ తమ కొలది ప్రతివారు సీతారామ భరత శతృఘ్నల విగ్రములను గానీ, శ్రీరామ పట్టాభిషేక పటమును గాని పెట్టి పూజ చెయ్యాలని పిలుపునిచ్చారు.పూజ మందిరంలో గానీ పీఠం పైన గానీ కడిగి పసుపు పీట వేసి దానిపై కుంకుమను అలంకరించాలి. పీట మధ్యన చందనంతో అష్టదళ పద్మమును రాయాలనీ వివరించారు. దానిపై నూతన వస్త్రమును పరచాలని, నూతన వస్త్రముపై బియ్యమును అర అంగుళం మందంగా నలుచదరంగా ఏర్పాటు చెయ్యాలని తెలిపారు…
అలాగె పీట మధ్యలో కలశం ఉండేలా ఉంచాలని, కళశమును గంధ పుష్పాక్షతలతో పూజించి దాని చుట్టూ దాని చుట్టూ అష్టదిక్పాలకులను, నవగ్రములను, అది దేవతా ప్రత్యాదివేతా సహితముగా అవగాహన చేసి మండ పారధన చేయవలెను అని తెలిపారు.అలాగే పూజా మండపుమునకు నాలుగు పక్కలా అరటి పిలకలు, లేత చేరుకుగడలు కట్టి, పులతోను, మామిడాకులతోనూ, అలంకరించాన్నారు. అలాగే పూజ జరిగే పందిరికి కొబ్బరి ఆకులు, అరటిబోదేలు, కట్టి , మామిడి తోరణాలతో అలంకరించాలనన్నారు.. తరువాత పురుష సూక్త సహితముగా శ్రీ రామ చంద్రమూర్తిని సపరివార సమేతముగా ఆవాహన చేసి పూజ చెయ్యాలని కోరారు.అలాగె రామాష్టోత్తరము, సీతాష్టోత్తరము.
అంజనేయష్టో త్తరము చదువుతూ తులసితో రామచంద్రుని, మారేడు దళములతో సీతాదేవిని, తమలపాకులతో ఆంజనేయుని పూజించి శ్రీ సూక్త పురుష శుక్తములు, విష్ణుసహస్రనామము పరించవలను అని, అలాగే రామ సహస్ర నామ పూజను పూజను కూడా జరిపించాలని వివరించారు.మనం శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు ‘ రాఅనగానే మన నోరు తెరుచుకొని మన లోపల పాపాలన్నీ బయటకువచ్చి, ఆరామనామ అగ్నిజ్వాలలో పడి దహించికిపోతాయంట అని అలాగనే మ అనే అక్షరం ఉచ్చరించప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే పాపాలు ఏవీ మనలోకి ఏవీ ప్రవేశించలేవట అని పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు.
ఇళ్లలో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు అని తెలిపారు. గిరిజన ప్రాంత ప్రజలు మీద శ్రీశ్రీశ్రీ సీతారాముల ఆశీస్సులు ఉండాలని, గిరిజన ప్రజలకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, రాష్ట్ర అభివృద్ధి జరగాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గిరిజన ప్రాంత కష్టాలను తొలగించడానికి అహర్నిశలు శ్రమించి కృషి చేస్తున్న జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పై ఆ సీతారాముల వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆయన సంకల్పానికి ముక్కోటి దేవతలు అండగా ఉండాలని మనస్పూర్తిగా కోరుచున్నాము అన్నారు. ప్రజలందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాడేరు మండల నాయకులు మజ్జి. సంతోష్, ఆలయ కమిటీ సభ్యులు భక్తులు, జనసైనికులు, జనసేన శ్రేణులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
