
అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం హుకుంపేట మండలం ఏప్రిల్ 3: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేట మండలం జర్రకొండ పంచాయతీ బండగరువు గ్రామం మారుమూల గిరిజన ప్రాంత ప్రజలు రోడ్డు సదుపాయం లేక తీవ్ర ఇబ్బదులకు గురూవుతున్నారు. విషయం తెలుసుకున్న హుకుంపేట మండల జనసేన పార్టీ మండల అధ్యక్షులు కోటేశ్వరరావు పడాల్ ఈరోజు గ్రామానికి సందర్శించి ప్రజలకు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
గ్రామస్తులు గేదలపాడు గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న మా గ్రామానికి కనీసం రోడ్డు సదుపాయం లేక ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కనీసం అస్పత్రికి వెళ్లాలన్నా, వృద్ధులు, వికలాంగులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, మధ్యలో ఉన్న వాగు వర్ష కాలంలో పూర్తిగా పొంగిపోయి నీటి ప్రవాహం ఎక్కువ ఉండడం వాళ్ళ కనీస అవసరాలకు బయటకు వెళ్ళడానికి కల్వర్ట్ కూడా లేకపోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని బాధను వ్యక్తపరిసారు. సమస్యను పరిష్కరించాలని జనసేన పార్టీ మండల అధ్యక్షులకు వినతిపత్రం అందజేశారు.
విషయం తెలుసుకున్న తరువాత వెంటనే మీ సమస్యను అధికారుల దృష్టిలో పెట్టి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని గ్రామస్థులకు తెలియజేయడమైనది. గ్రామస్తులు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా మా గోడును ఎవరు పట్టించుకోలేదు. కనీసం మీరైనా మా సమస్యను పరిష్కరిస్తారని ఆశభావం వ్యక్తం చేసారు. కార్యక్రమంలో బంద గరువు, గేదలపాడు గ్రామస్థులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
