4 వ తేదీన పెద్దపల్లి లో జరిగే (ముఖ్యమంత్రి) యువ వికాసం సభ కి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయండి.
కార్మిక లోకానికి జనక్ పిలుపు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు ఇటుక్ సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన యువ వికాసం సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన
శాసన సభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణ లో ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని,
రైతు సంక్షేమం కోసం రైతు రుణమాఫీ , మహిళల సంక్షేమం కోసం గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం , 10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ , యువకుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ లో అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర అవుతుందని.
ముఖ్యంగా సింగరేణి కార్మికుల చిరకాల వాంఛ అయిన కార్మికుల సొంత ఇంటి కల , పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ గురించి ప్రభుత్వ తో మాట్లాడటం జరిగిందని త్వరలోనే ఆచరణ కాబోతుందని తెలిపారు. అంతే కాకుండా తెలంగాణ లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ముఖ్యంగా కార్మికుల కృషి వల్ల ఎన్నడూ లేని విధంగా సింగరేణి లో అత్యధిక ఉత్పత్తి, ఉత్పాదక మరియు లాభాలు గడించిందని. ప్రభుత్వం కూడా సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే పెండింగ్ లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగుల వయోపరిమితి 35-40 ఏళ్ల పెంపు , రామగుండం లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ , 800 మెగా వాట్ల పవర్ ప్లాంట్లు , ఒడిసా లో నైని ప్రాజెక్టు నిర్మాణం , స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు , కోటి రూపాయల ప్రమాద భీమా , స్థానికులకే 80% ఉద్యోగాలు , సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం, బీసీ లైజనింగ్ ఆఫీసర్ నియామకం వంటి అనేక కార్యక్రమాలు చెప్పటామని సింగరేణి కార్మికులకు గతంలో కన్నా ఎక్కువ 796 కోట్లు లాభాలు ఇవ్వటం తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు కృషి పలితంగా కాంట్రాక్టు కార్మికుల కి కూడా లాభాలలో నుండి 5000 రూపాయలు ఇప్పించామని. అలాగే భవిష్యత్ లో కూడా రామగుండం లో 1000 క్వార్టర్లు తో గేటెడ్ కమ్యూనిటీని తరహా నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు.
4 వ తేదీన జరిగే యువ వికాసం సభ కి పెద్ద సంఖ్యలో కార్మికులు, యువకులు హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో , సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహ రెడ్డి ,ధర్మపురి, కాంపెల్లి సమ్మయ్య,
జెట్టి శంకర్ రావు, కలవేన శ్యామ్ , భూచయ్య, సదానందం ,రఘుపతి రెడ్డి , జనరల్ సెక్రటరీలు వంగ లక్ష్మిపతి గౌడ్,ఎండీ అక్రమ్ పసునూటీ రాజేందర్,వికాస్ కుమార్ యాదవ్, జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి దాస్, రీజినల్ జనరల్ సెక్రటరీ ఆరెల్లి పోషం.చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామిశెట్టి నరేందర్, ఏరియా వైస్ ప్రెసిడెంట్లు కొత్త సత్యనారాయణ రెడ్డి, కోట రవీందర్ రెడ్డి, దేవి భూమయ్య, మధుకర్ రెడ్డి ,పేరం శ్రీనివాస్ , సోషల్ మీడియా ఇంచార్జ్ వేణుగోపాల్ యాదవ్, జాయింట్ జనరల్ సెక్రటరీలు గడ్డం కృష్ణ, దేవులపల్లి రాజేందర్, బత్తుల పోచయ్య, స్వామి, మహిళా అధ్యక్షురాలు శేషా రత్నం, మైనింగ్ స్టాఫ్ ఇంచార్జ్ పోతరబోయిన సమ్మయ్య యాదవ్ & తిరుపతి రాజు,, సెంట్రల్ సెక్రటరీ , పుట్ట రమేష్, మండ రమేష్,బ్రాంచ్ సెక్రటరీలు గుండేటి శ్రీనివాస్, ఎదులాపురం శ్రీనివాస్ , అల్లావుద్దీన్, తాటి రాజయ్య, సుశీల, లలిత శ్రీ , తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App