Vijayawada: జగనన్నా.. మెగా డీఎస్సీ ఎక్కడ?.. విజయవాడలో నిరుద్యోగుల దీక్ష
విజయవాడ: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను తక్షణమే విడుదల చేయాలంటూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగులు దీక్ష చేపట్టారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో 36 గంటల నిరసన దీక్షకు పిలుపునిచ్చారు..
10 లక్షల మంది డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లలో నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంపై మండిపడ్డారు. జగనన్నా మెగా డీఎస్సీ ఎక్కడ? అంటూ ప్రశ్నించారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని ధ్వజమెత్తారు..