
ఏపీ : ఎన్నికల ముందు జగన్ కు భారీ షాక్ తగిలింది. దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేస్తూ.. లేఖను సీఎం జగన్ కు పంపించారు. ఆయన జనసేన, టీడీపీ వైపు చూస్తున్నట్లుగా సమాచారం. గుడివాడ అమర్నాథ్ తో ఉన్న వైరుధ్యాలు, వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆయన రాజీనామా చేస్తున్నట్లు ఏక వాక్యంలో రాజీనామా లేఖను పంపించారు.
