భారత యువ రెజ్లర్ సంగీతా ఫోగట్ తన భుజబలాన్ని ప్రదర్శించింది.
తన జాతీయ, అంతర్జాతీయ కెరీర్‌లో ప్రత్యర్థులను మట్టికరిపించిన సంగీత.. టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ పనిపట్టింది.
జలక్ దిక్ ఆజా అనే డ్యాన్స్ కార్యక్రమం ముగింపు సంబురాలకు హాజరైన చాహల్‌ను ఉన్నఫళంగా భుజాలపైకి ఎత్తుకుని గిరాగిరా తిప్పింది.
దీంతో ఒక్కసారిగా అవాక్కు గురైన చాహల్ ఇక ఆపేయంటూ ఫోగట్‌ను వేడుకున్నాడు..