TRINETHRAM NEWS

ఏపీ లో అధికారం దక్కేదేవరికి పబ్లిక్ పల్స్ క్లియర్ గా తేల్చి చేపిన ప్రముఖ సర్వే సంస్థ*

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ వర్సస్ టీడీపీ,జనసేన పోటీ పడుతున్నాయి. తన సంక్షేమం తనకు అధికారం నిలబెడుతుందని జగన్ ధీమాగా ఉన్నారు.

ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని చంద్రబాబు, పవన్ అంచనా వేస్తున్నారు. బీజేపీ వైఖరి తేలాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రముఖ ఎన్నికల విశ్లేషకులు ఏపీలో పబ్లిక్ పల్స్ ఏంటనేది బయట పెట్టారు. అనూహ్య ఫలితాలు వెల్లడించారు.

మారుతున్న సమీకరణాలు
ప్రముఖ సెఫాలజిస్ట్..ఎన్నికల ఫలితాల విశ్లేషకులు పార్ధదాస్ ఏపీలో ప్రజల మూడ్ ఏంటనేది వెల్లడించారు. ఏపీలో తాజాగా నిర్వహించిన సర్వేలో పబ్లిక్ పల్స్ ఎలా ఉందో బయట పెట్టారు. పార్ధదాస్ వెల్లడించిన నివేదిక ప్రకారం వైసీపీకి 46 శాతం ప్రజల మద్దతు ఉంది. అదే విధంగా టీడీపీకి 40 శాతం, జనసేనకు 11 శాతం మద్దతు ఉన్నట్లు వెల్లడించారు.

ఇతరులకు ఒక శాతం మాత్రమే ప్రజా మద్దతు ఉందని విశ్లేషించారు. అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి 48 శాతం మద్దతు ఉండగా.. టీడీపీకి 43 శాతం మద్దతు ఉన్నట్లు తేల్చారు. జనసేనకు 8 శాతం మంది ప్రజల మద్దతు ఉంటుందని.