Trinethram News : 6th Jan 2024
భవిష్యత్తులో మనిషి జీవించే కాలము పెరగొచ్చు – ఇస్రో చైర్మన్ సోమనాథ్
రాబోయే రోజుల్లో మనిషి జీవించే కాలము పెరిగే అవకాశం ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. విద్యా, వైద్య, ఫార్మా రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు భవిష్యత్తులో వచ్చే వినూత్న ఆవిష్కరణలతో పాటు జీవన ప్రమాణ రేటు కూడా పెరిగే అవకాశం ఉందని అన్నారు.
శరీరంలో పాడైన అవయవాలను, చనిపోయే దశలో ఉన్న జీవ కణాలను మార్చటం ద్వారా మనిషి 200 నుండి 300 యేళ్లు జీవించే వీలు వుంటుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు.