TRINETHRAM NEWS

Trinethram News : శాస్త్రవేత్తలు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

ఇన్సాట్‌-3DSతో భూ, సముద్ర వాతావరణంపై కచ్చితమైన సమాచారం అందుతుందని పేర్కొన్నారు.

తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌.. శ్రీహరికోట నుంచి ఈ సాయంత్రం 5 గంటల 35 నిమిషాల కు GSLV-F14 వాహక నౌక.. ఇన్సాట్‌-3DS ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది.

2వేల 275 కిలోల బరువు ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది.

ఇన్సాట్‌-3DSను వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు.

తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది.