TRINETHRAM NEWS

తాత ఆస్తిపై మనువడే హక్కుదారుడా? అసలు విషయం తెలిస్తే షాక్‌..

భారతదేశంలో ఆస్తికి సంబంధించి స్పష్టమైన చట్టాలు ఉన్నప్పటికీ దేశంలోని కోర్టుల్లో ఆస్తి వివాదాలకు సంబంధించిన లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇది చాలా క్లిష్టంగా ఉంది. అలాంటి కేసులు సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కుటుంబంలోని పెద్ద సభ్యులు ఆస్తిని సకాలంలో పంపిణీ చేయడం సరైన మార్గమని నిపుణుల పేర్కొంటున్నారు. భారతదేశంలో తాత, మనవడి మధ్య ఆస్తి విషయంలో తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాత ఆస్తిపై మనవడికి ఎంత హక్కు ఉందో? ఎలాంటి ఆస్తిని క్లెయిమ్ చేయవచ్చో తెలుసుకోవడం మంచిదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ వివాదంపై న్యాయ నిపుణులు ఏం చెబుతున్నారో? ఓసారి తెలుసుకుందాం. తాత స్వయంగా సంపాదించిన ఆస్తిపై మనవడికి జన్మహక్కు ఉండుదు. మనవడికి పూర్వీకుల ఆస్తిలో మాత్రమే జన్మహక్కు ఉంటుంది. కానీ, తాతయ్య చనిపోయిన వెంటనే తన వాటా దక్కదు. తాత స్వయంగా ఆస్తిని కొనుగోలు చేస్తే అతను అలాంటి ఆస్తిని ఎవరికైనా ఇవ్వవచ్చు మరియు మనవడు తాత నిర్ణయాన్ని సవాలు చేయలేడు.

ఆస్తిపై వారసత్వ హక్కు ఇలా
ఒక వ్యక్తి వీలునామా చేయకుండా మరణిస్తే అతని తక్షణ చట్టబద్ధమైన వారసులు అంటే అతని భార్య, కుమారుడు, కుమార్తె మాత్రమే అతని స్వీయ-ఆర్జిత ఆస్తికి వారసులు అవుతారు. మనవడికి వాటా రాదు. మృతుని భార్య, కుమారులు, కుమార్తెలకు సంక్రమించిన ఆస్తి వారి వ్యక్తిగత ఆస్తిగా పరిగణించబడుతుంది. ఆ ఆస్తిలో వాటాను పొందే హక్కు మరెవరికీ ఉండదు. తాతకు సంబంధించిన కుమారులు లేదా కుమార్తెల్లో ఎవరైనా అతని మరణానికి ముందు మరణిస్తే మరణించిన కుమారుడు లేదా కుమార్తెకు సంబంధించిన చట్టపరమైన వారసుడు మొదటి కుమారుడు లేదా కుమార్తె పొందాల్సిన వాటాను పొందుతారు. ఒక వ్యక్తి తాత చనిపోతే, అతని తాత ఆస్తి మొదట అతని తండ్రికి చెందుతుంది. దీని తరువాత అతను తన తండ్రి నుంచి తన వాటాను పొందే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి తండ్రి తన తాత మరణానికి ముందు చనిపోతే అతను నేరుగా తన తాత ఆస్తిలో వాటా పొందుతాడు.

పూర్వీకుల ఆస్తిపై హక్కులు
పూర్వీకుల ఆస్తిపై మనవడికి జన్మహక్కు ఉంది. దీనికి సంబంధించి ఏదైనా వివాదం తలెత్తితే అతను సివిల్ కోర్టుకు వెళ్లవచ్చు. తండ్రి లేదా తాత తన పూర్వీకుల నుంచి సంక్రమించిన పూర్వీకుల ఆస్తికి ఎలా అర్హులో అదే విధంగా అతను ఈ ఆస్తికి అర్హులు. కానీ తాతయ్య చనిపోయాక పూర్వీకుల ఆస్తి మనవడికి కాకుండా తండ్రికి చేరుతుంది. అతను తన వాటాను తన తండ్రి నుంచి మాత్రమే పొందుతాడు. తండ్రి పూర్వీకుల ఆస్తిలో వాటా ఇవ్వడానికి నిరాకరిస్తే అతను కోర్టుకు వెళ్లవచ్చు.