
Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఈనెల 8 వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , రాష్ట్ర హోం మంత్రి వి. అనిత, రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్., ,గుంటూరు రేంజ్ ఐజిపి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఐపిఎస్ ఆదేశములతో మహిళా దినోత్సవం వారోత్సవాలు జరగనున్నాయి.
ఈ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయం నందు పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలోని మహిళా పోలీసు సిబ్బందికి మరియు సచివాలయం మహిళా పోలీసులకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ హాజరై మెడికల్ క్యాంపు ను ప్రారంభించడం జరిగింది. పోలీసు శాఖ నందు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని ఎస్పీ తెలిపారు.
ఈ మెడికల్ క్యాంపు నిర్వహించుటకు గాను
- డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్సీ విజన్ కంటి వైద్యశాల
- కొండవీడు ENT హాస్పిటల్
- గాయత్రి స్కిన్ కేర్ వైద్యశాల
- లిఖిత ఆర్థో
వైద్యశాల - హన్విత జనరల్ వైద్యశాల
- వసంత డెంటల్ కేర్ వైద్యశాల
- హిమబిందు గైనిక్ వైద్యశాల వారు పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సుమారు 151 మంది మహిళా సిబ్బంది వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది.
అనంతరం ఎస్పీ నరసరావు పేట లోని రైల్వే స్టేషన్ వద్ద గల SC,ST బాలికల వసతి గృహాన్ని పరిశీలించి చట్టపరంగా ఏమైనా సమస్యలు ఉన్న యెడల తమ దృష్టికి వెంటనే తీసుకు రావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీ (పరిపాలన) J.V. సంతోష్ , అదనపు ఎస్పి (AR) V. సత్తి రాజు , మహిళా పోలీస్ స్టేషన్ డి ఎస్పీ M.వెంకట రమణ ,RI వెల్ఫేర్ L. గోపీ నాథ్ ,అడ్మిన్ RI M. రాజా ,హోమ్ గార్డ్ RI S. కృష్ణ పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
