TRINETHRAM NEWS

లంగాణ పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు..!!

వినాయక నిమజ్జనంలో ఏఐ టెక్నాలజీ వినియోగానికి పురస్కారం

Trinethram News : హైదరాబాద్‌ : డిసెంబరు 17 : వినాయక విగ్రహాల నిమజ్జనంలో కృత్రిమ మేధ(ఏఐ) వినియోగించినందుకు రాష్ట్ర పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

ఈ ఏడాది గణేష్‌ చతుర్థి ఉత్సవాల్లో లక్షన్నరకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. లక్షలాది మంది పాల్గొన్న ఈ ఉత్సవాల్లో తొలిసారి ఏఐ, జియోగ్రఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం(జీఐఎస్‌) వినియోగించారు. భారీ సమావేశాలు, ట్రాఫిక్‌ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ పరిజ్ఞానాన్ని పోలీసులు వినియోగించారు. తొక్కిసలాట జరగకుండా ఏఐ టెక్నాలజీతో అనుసంధానమైన డ్రోన్లను వినియోగించారు. శాంతి భద్రతల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అమలుచేసిన ఈ విధానం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందింది.

ప్రజారక్షణలో ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తున్న ప్రభుత్వాలు, సంస్థలకు.. ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌ ఐఎ్‌సజీ, సీఎన్‌బీసీ-టీవీ18 సంస్థలతో కలిసి అవార్డులు అందించగా.. డిజిటల్‌ ఇంజినీరింగ్‌ అవార్డులలో చాలెంజర్‌ క్యాటగిరీలో అత్యుత్తమ స్థిరత్వ కార్యక్రమ(టాప్‌ సస్టెయినబిలిటీ ఇనిషియేటివ్‌) పురస్కారం తెలంగాణ పోలీసు శాఖకు ప్రకటించారు. ఈ క్యాటగిరీలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 230 నామినేషన్ల నుంచి తెలంగాణ పోలీసులకు పురస్కారం దక్కింది. స్మార్ట్‌ సిటీ టెక్నాలజీలో తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రామాణికాలను నిర్దేశించిందని అవార్డుల కమిటీ ప్రశంసించింది. ఈ అవార్డు దక్కడంపై అదనపు డీజీపీ వి.వి.శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో టెక్నాలజీ వినియోగానికి ఈ పురస్కారం దక్కడం మరింత ప్రోత్సాహాన్ని అందించిందని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App