
ఏడిద ప్రభంజనం..
జెడ్ పి పాఠశాల ప్లస్ విద్యార్థుల విజయభేరి…
త్రినేత్రం న్యూస్ : మండపేట. ఇంటర్ ఫలితాల్లో ఏడిద ప్రభంజనం సృష్టించింది. గ్రామీణ ప్రాంతం పైగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఇలాంటి ఫలితాలు రావడం విశేషం. ఏడిద జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ ఇంటర్ ఫలితాల్లో మరోసారి తన సత్తా చాటింది. ఇంటర్ సెకండియర్ ఎంపీసీ విద్యార్థిని కొమ్ము శైలజ 946 మార్కులతో ప్రధమ స్థానం సాధించగా ఫస్ట్ ఇయర్ బైపిసి లో పంతంగి రమ్యశ్రీ 433/440 మార్కులతో తమ సత్తా చాటారు.
ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఫలితాలు 100% పాసయ్యారు. సెకండియర్ లో ఎంపీసీ లో 80% మంది విద్యార్థులు పాసయ్యారు. ఎంపీసీలో 908 మార్కులతో కోసూరు శాలిని ద్వితీయ స్థానం సాధించింది. జిల్లాలో హైస్కూల్ ప్లస్ ల ఏడిద జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ మంచి స్థానాన్ని సాధించడం పట్ల ప్రధానోపాధ్యాయులు ముంగర వెంకటరాజు విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ప్రధానోపాధ్యాయులు ఆకాంక్షించారు. ఫస్ట్ ఇయర్ బైపిసి లో ఎం. మేఘన 419 మార్కులతో ద్వితీయస్థానo సాధించింది. గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, అభినందించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
